తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ‘పెళ్ళి చూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాలు మంచి విజయం సాధించాయి.అయితే ఆ తరువాత ‘మీకు మాత్రమే చెప్తా’ అనే సినిమాలో హీరోగా నటించాడు. తాజాగా తరుణ్ భాస్కర్ తన తదుపరి సినిమాని ప్రకటించారు. క్రైమ్ కామెడీ నేపథ్యంలో ఈ సినిమా చేయనున్నట్టు తెలిపాడు. ఈ సినిమాకి 'కిడ కోల' అనే పోస్టర్‌ను ఆయన విడుదల చేశారు.