గతేడాది విడుదలై, అంచనాలకు మించి ఘనవిజయం సాధించిన సినిమా పుష్ప. సుకుమార్ డైరెక్షన్లో అల్లు అర్జున్, రష్మిక మండన్నా జంటగా నటించిన ఈ చిత్రం గంధపుచెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కింది. ఉత్తరాదిన పుష్ప సంచలన విజయం సాధించింది. నిజానికి పుష్ప సీక్వెల్ కోసం, తెలుగు ప్రేక్షకుల కన్నా హిందీ జనాలే ఆదుర్దాగా ఉన్నారు. ఈ నేపథ్యంలో పుష్ప సీక్వెల్ పై రోజుకొక అప్డేట్ పుట్టుకొస్తుంది.
ఈ సినిమాపై లేటెస్ట్ టాక్ ఏంటంటే, పుష్ప 2 స్క్రిప్ట్ ప్రకారం, సౌత్ ఆసియా లోని ఒక ప్రధాన దేశంలో అంటే చైనా, జపాన్, తైవాన్ లాంటి ఏదో ఒక దేశంలో పుష్ప 2 షూటింగ్ జరగాలి. ఈ క్రమంలో బన్నీకి ఒక ఫారిన్ బ్యూటీ తారసపడుతుంది. ఇందుకోసం ఒక విదేశీ నటిని తీసుకోవాలనే ఆలోచనలో పడ్డారట సుకుమార్. అంతకన్నా ముందు ఈ వెర్షన్ ను బన్నీకి వినిపించి, ఆయన ఓకే చేసిన తర్వాతనే ముందుకెళ్లాలని అనుకుంటున్నాడట. చూడాలి...మరి సుకుమార్ రాసిన పుష్ప 2 న్యూ వెర్షన్ లోని న్యూ ఎపిసోడ్ బన్నీ కి నచ్చుతుందో, లేదో ..!
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa