కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార ఇటీవలే పెళ్లి చేసుకున్న విషయం అందరికి తెలిసిందే. జూన్ 9వ తేదీన, చిరకాల మిత్రుడు, ప్రేమికుడు డైరెక్టర్ విఘ్నేష్ శివన్ తో ఏడడుగులు నడిచిన ఈ 37ఏళ్ళ సీనియర్ హీరోయిన్ ఆ వెంటనే థాయిలాండ్ హనీమూన్ ట్రిప్ కి వెళ్లారు. హానీమూన్ వెకేషన్ ను ముగించుకుని ఇండియాకు తిరిగొచ్చిన నయన్ ఒక్క రోజు కూడా వేస్ట్ చెయ్యకుండా వెంటనే వర్క్ కమిట్మెంట్స్ ను స్టార్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఈ మేరకు ఆదివారం ముంబై మహానగరంలో అడుగుపెట్టిన నయన్, తదుపరి షారుఖ్ ఖాన్ ను కలిసి జవాన్ మూవీ డిస్కషన్స్ లో పాల్గొనున్నట్టు తెలుస్తుంది.
కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్లో షారుఖ్, నయన్ జంటగా నటిస్తున్న చిత్రం "జవాన్". ఈ మూవీ టీజర్ ఇటీవల విడుదలై, సినిమా పట్ల ప్రేక్షకుల్లో భారీ అంచనాలను నెలకొల్పింది. పోతే, ఈ సినిమాతోనే నయన్ బాలీవుడ్ డిబట్ ఎంట్రీ ఇస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa