మారుతీ డైరెక్షన్ లో టాలీవుడ్ స్టార్ హీరో గోపీచంద్ సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసందే. ఈ సినిమాకి 'పక్కా కమర్షియల్' అనే టైటిల్ ని మేకర్స్ లాక్ చేసారు. ఈ యాక్షన్-కామెడీ ఎంటర్‌టైనర్ మూవీలో గోపీచంద్ సరసన బబ్లీ బ్యూటీ రాశి ఖన్నా జోడిగా నటిస్తుంది. ఈ సినిమాలో సత్యరాజ్, అనసూయ భరద్వాజ్, రావు రమేష్, సప్తగిరి కీలక పాత్రలు పోషిస్తున్నారు. పక్కా కమర్షియల్ సినిమా జూలై 1న విడుదల కానుంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను ఆహా సొంతం చేసుకున్నట్లు గతంలో మూవీ మేకర్స్ ప్రకటించారు. తాజాగా ఇప్పుడు ఈ సినిమా OTT రైట్స్ ని నెట్‌ఫ్లిక్స్ కూడా సొంతం చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్ మరియు ఆహా ప్లాట్ఫారంస్ లో థియేట్రికల్ విడుదలైన ఐదు వారాల తర్వాత ప్రసారానికి అందుబాటులోకి రానుంది అని సమాచారం. UV క్రియేషన్స్ అండ్ GA2 పిక్చర్స్ ఈ సినిమాని నిర్మించింది. ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం మరియు కర్మ్ చావ్లా సినిమాటోగ్రఫీ అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa