ప్రముఖ టాలీవుడ్ నిర్మాత బెల్లంకొండ సురేష్ రెండవ తనయుడు గణేష్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం "స్వాతిముత్యం". గణేష్ సరసన యువనటి వర్ష బొల్లమ్మ నాయికగా నటిస్తుంది. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. మహతీ స్వరసాగర్ సంగీతమందించిన ఈ మూవీ ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
తాజాగా మేకర్స్ ఈ మూవీ నుండి ఫస్ట్ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేసారు. మిల మిలా మెరుపులా అని సాగే ఈ పాటను అర్మాన్ మాలిక్, సంజనా ఆలపించగా, కృష్ణ కాంత్ లిరిక్స్ అందించారు. ఈ పాట హీరోహీరోయిన్ల మధ్య సాగే ప్రేమ గీతంగా చిత్రీకరింపడింది. స్క్రీన్ పై వర్ష, గణేష్ ల పెయిర్ ఫ్రెష్ గా కనిపించగా, బ్యాక్ గ్రౌండ్ లో వినిపించే ఈ సాంగ్ అదనపు ఆకర్షణగా నిలిచింది. ప్రేక్షకులకు ముఖ్యంగా ప్రేమికులకు బాగా నచ్చే ఈ ప్రేమ గీతం ఖచ్చితంగా చార్ట్ బస్టర్ అవుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa