ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆకట్టుకుంటోన్న 'నీవెవరో' ట్రైలర్

cinema |  Suryaa Desk  | Published : Wed, Aug 22, 2018, 03:38 PM

ఆది పినిశెట్టి హీరోగా 'నీవెవరో' సినిమా రూపొందింది. హరనాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆది పినిశెట్టి సరసన తాప్సీ .. రితికా సింగ్ కథానాయికలుగా నటించారు. ఎమ్ వీవీ సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమా నుంచి తాజాగా ట్రైలర్ ను వదిలారు. చరణ్ చేతులమీదుగా ఈ ట్రైలర్ ను రిలీజ్ చేయించారు.ప్రధాన పాత్రలను కవర్ చేస్తూ ఈ ట్రైలర్ ను కట్ చేశారు. ఒక కేసుకు సంబంధించిన ఆధారాల కోసం అన్వేషిస్తోన్న యువకుడిగా ఆది పినిశెట్టి కనిపిస్తున్నాడు. కామెడీ పోలీస్ గా వెన్నెల కిషోర్ సందడి చేస్తున్నాడు. యాక్షన్ .. కామెడీ .. రొమాన్స్ కి సంబంధించిన సన్నివేశాలతో ఈ ట్రైలర్ ను అందించారు. వెన్నెల కిషోర్ .. సప్తగిరి కామెడీ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని ట్రైలర్ ను బట్టి అనిపిస్తోంది. ఈ నెల 24వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఆది పినిశెట్టికి ఈ సినిమాతో హిట్ పడుతుందేమో చూడాలి









SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa