ఈ మధ్యకాలంలో రాజమౌళి చీఫ్ గెస్ట్ గా పాల్గొంటున్న మూవీ ఫంక్షన్లు బాగా ఎక్కువవుతున్నాయి. తాజాగా లావణ్య త్రిపాఠి లీడ్ రోల్ పోషించిన "హ్యాపీ బర్త్ డే" ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ కు రాజమౌళి చీఫ్ గెస్ట్ గా పాల్గొని, ట్రైలర్ ను రిలీజ్ చెయ్యబోతున్నారు. ఈమేరకు మేకర్స్ కొంచెంసేపటి క్రితమే అధికారిక ప్రకటన చేశారు.
మత్తు వదలరా సినిమాతో క్రియేటివ్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రితేష్ రాణా ఈ సినిమాకు దర్శకుడు, కాగా, క్లాప్ ఎంటర్టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాలభైరవ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం జూలై 22న విడుదలకాబోతుంది.
![]() |
![]() |