అక్కినేని కుటుంబం నుండి వచ్చిన యంగ్ హీరో నాగచైతన్యకు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు ఉంది. మొదటి సినిమా ఏ మాయ చేసావే సినిమాతో లవర్ బాయ్ గా ఇమేజ్ సంపాదించుకున్న చైతూ, తదుపరి ప్రేమకథా చిత్రాల్లోనే ఎక్కువగా నటించడంతో టాలీవుడ్ యువ మన్మథుడిగా అవతరించి తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నాడు.
పోతే..., విక్రమ్ కే కుమార్ డైరెక్షన్లో నాగ చైతన్య,రాశిఖన్నా జంటగా నటించిన కొత్త చిత్రం "థాంక్యూ". ఈ మూవీ జూలై 22న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో కొన్నిరోజుల నుండి ప్రమోషన్ కార్యక్రమాలను జరుపుకుంటున్నచిత్రబృందం లేటెస్ట్ గా ఫేర్ వెల్ అనే లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేసింది. హైదరాబాద్ లోని మల్లారెడ్డి విశ్వవిద్యాలయంలో ఈ సాంగ్ లాంఛ్ కార్యక్రమం జరిగింది. ఈ ఈవెంట్లో ఒక స్టూడెంట్ మాట్లాడుతూ... థాంక్యూ చిత్రం థియేటర్లో చూడటానికిగాను హాస్టల్ లో ఉండే లేడీ స్టూడెంట్స్ కు సెలవు కావాలని అడిగింది. ఆ వెంటనే దిల్ రాజు అందుకుని స్టూడెంట్స్ అందరి తరపున కాలేజ్ యాజమాన్యాన్ని 22వ తేదీన సెలవిమ్మని రిక్వెస్ట్ చేసారు. కాలేజీ యాజమాన్యం సైతం దిగొచ్చి, 22వ తేదీ మధ్యాహ్నం నుండి సెలవు ప్రకటించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తమ అభిమాన హీరో సినిమాను తొలిరాజు థియేటర్లో చూసే అవకాశం అధికారికంగా లభించినందుకు మల్లారెడ్డి స్టూడెంట్స్ సంతోషంగా ఉన్నారు.
![]() |
![]() |