యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే కదా. ఈ సినిమాలో ఆలియాభట్ హీరోయిన్ అని ఆర్ ఆర్ ఆర్ మూవీ విడుదల సమయంలో జోరుగా ప్రచారం జరిగింది. కానీ, ఈ విషయమై చిత్రబృందం ఎలాంటి అధికారిక ప్రకటన చెయ్యలేదు. ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ నుండి ఆలియా భట్ తప్పుకున్నట్టు కూడా మీడియాలో వార్తలొచ్చాయి. ఆర్ ఆర్ ఆర్ లో తన రోల్ పట్ల అసంతృప్తిగా ఉన్న ఆలియా, కొరటాల చెప్పిన స్టోరీతో సంతృప్తి చెందకపోవడంతో ఈ మూవీ నుండి పక్కకు తొలగిందని టాక్.
ఐతే, నిన్న ఆలియా గర్భం దాల్చిన విషయం అధికారికంగా ప్రకటించబడడంతో మరోసారి ఎన్టీఆర్ 30 మూవీ తెరపైకి వచ్చింది. రణ్ బీర్ తో పెళ్ళైన వెంటనే పిల్లల్ని కనాలనే ఆలోచనలో ఉన్న ఆలియా, ఆ కారణం చేతనే ఎన్టీఆర్ 30 మూవీని రిజెక్ట్ చేసిందని ప్రస్తుతం మీడియాలో నడుస్తున్న టాక్. మరికొంతమంది అభిప్రాయం ప్రకారం, ఏప్రిల్ 14న రణ్ బీర్ ను పెళ్లి చేసుకున్న ఆలియా అప్పటికే గర్భవతని, అందుకే ఎన్టీఆర్ సినిమాకు నో చెప్పిందని అంటున్నారు. కారణం ఏదైనా కానీ, ఆలియా తెలుగు ప్రేక్షకులను పలకరించే సమయం ఇంకా రానందుకు ఆమె తెలుగు అభిమానులు బాధపడుతున్నారు.
![]() |
![]() |