మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన తమ సొంతింటిలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, పూజాహెగ్డే, వెంకటేష్ లకు మొన్ననే బిగ్ పార్టీ ఇచ్చారు. ఈ విషయం అందరికి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వీరవిహారం చేస్తోంది. ఇదిలా ఉండగానే, చరణ్, ఉపాసనలు మరోసారి మరో బాలీవుడ్ స్టార్ కు ఆతిధ్యమందించి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా నిలిచారు.
ఈసారి చెర్రీ ఇంట సందడి చేసిందెవరో తెలిస్తే షాకైపోతారు. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమీర్ ఖాన్ నిన్న సాయంత్రం చరణ్ ఇంట్లో గ్రాండ్ గా ఏర్పాటు చేసిన డిన్నర్ లో పాల్గొని, క్యూట్ కపుల్ తో మెమొరబుల్ మూమెంట్స్ ను షేర్ చేసుకున్నారు. చెర్రీ, ఆమిర్ ఖాన్ తో కలిసి దిగిన ఫోటోను ఉపాసన ఇన్స్టాలో షేర్ చేసింది. దీంతో ఈ పిక్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మొత్తానికి సీజనల్ హోస్ట్ గా చెర్రీ దంపతులు నిలిచారని మెగా అభిమానులు ఖుషి అవుతున్నారు.
![]() |
![]() |