ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సుక్కా..ముక్కా...పక్కా... అన్నీ "పక్కా కమర్షియలే"...

cinema |  Suryaa Desk  | Published : Tue, Jun 28, 2022, 04:36 PM

మారుతి డైరెక్షన్లో గోపీచంద్, రాశిఖన్నా జంటగా నటించిన చిత్రం "పక్కా కమర్షియల్". ప్రపంచవ్యాప్తంగా జూలై 1వ తేదీన విడుదల కాబోతున్న ఈ చిత్రానికి జెక్స్ బిజోయ్ సంగీతం అందించారు. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో, కొన్నిరోజుల నుండి ప్రచార కార్యక్రమాలు ఒక రేంజులో జరుగుతున్నాయి. ఈ క్రమంలో సినిమా టైటిల్ వీడియో సాంగ్ ను కొంచెంసేపటి క్రితమే మేకర్స్ విడుదల చేసారు. సుక్కా, ముక్కా, పక్కా అన్నీ కమర్షియలెయ్ అని హీరో అండ్ బృందం కలిసి స్టెప్పులేసే ఈ పాట వినటానికి, చూడటానికి చాలా బాగుంది. గోపీచంద్ సన్నని ఫిజిక్, లేట్ లెజెండ్ సీతారామ శాస్త్రి అందించిన లిరిక్స్ పాటకు హైలైట్ గా నిలిచాయి. సిరివెన్నెల చనిపోయే ముందు ఆఖరిసారిగా సాహిత్యమందించిన పాట ఇదే. దీంతో సిరివెన్నెల అభిమానులు కూడా ఈ పాట పట్ల స్పెషల్ ఇంటరెస్ట్ చూపిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com