పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో మూడు సార్లు స్క్రీన్ షేర్ చేసుకునే అద్భుతమైన అవకాశాన్ని కొట్టేసింది కోలీవుడ్ బ్లాక్ బ్యూటీ త్రిష. ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన వర్షం, పౌర్ణమి, బుజ్జిగాడు సినిమాలు మంచి విజయం సాధించాయి. కొన్నాళ్ల నుండి తెలుగు సినిమాలకు దూరమైన త్రిషకు కోలీవుడ్ లో కూడా చెప్పుకోదగ్గ ఆఫర్లు రావట్లేదు.
తాజాగా త్రిషకు ఒక పెద్ద సినిమాలో లీడ్ హీరోయిన్ గా నటించే గోల్డెన్ ఛాన్స్ వచ్చిందని కోలీవుడ్ మీడియా వర్గాల సమాచారం. సూపర్ స్టార్ రజినీకాంత్, జ్యోతిక, నయనతార ముఖ్యపాత్రలు పోషించిన "చంద్రముఖి" సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న "చంద్రముఖి 2" లో త్రిష హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యిందట. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన గత వారంలోనే జరిగింది. పి. వాసు డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమాలో లారెన్స్ మేల్ లీడ్ పోషిస్తున్నారు. హీరోయిన్ త్రిష విషయమై మేకర్స్ త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నారు.