సౌత్‌తో పాటు బాలీవుడ్‌లోనూ హీరోయిన్ పూజా హెగ్డే సత్తా చాటుతోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో హృతిక్ రోషన్‌తో తాను చేసిన 'మొహంజోదారో' తన కెరీర్‌లోనే చెత్త సినిమాగా అభివర్ణించింది. దాని వల్ల తనకు సంవత్సరం పాటు సినిమా ఆఫర్లు రాలేదని పేర్కొంది. 'అల వైకుంఠపురంలో' సినిమా తనకు బ్రేక్ ఇచ్చిందని, తనపై ఐరన్‌లెగ్ ముద్ర పోయిందని పేర్కొంది. ప్రస్తుతం సల్మాన్‌ఖాన్ సినిమా 'కబీ ఈద్ కబీదివాలీ'లో ఆమె నటిస్తోంది.