బాలీవుడ్ సూపర్ స్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ అంటే ఇష్టపడని వారుండరంటే అతిశయోక్తి కాదేమో. దేశవిదేశాల్లో సీనియర్ బచ్చన్ కు లక్షల సంఖ్యలో అభిమానులున్నారు. బచ్చన్ అభిమానుల్లో టాప్ సెలెబ్రిటీలు కూడా ఉన్నారు. ఈ లిస్ట్ లో తాజాగా టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని కూడా చేరారు.
ప్రాజెక్ట్ కే షూటింగ్ నిమిత్తం హైదరాబాద్ లో ఉన్న అమితాబ్, ఇటీవల జరిగిన వైజయంతి మూవీస్ కొత్త ఆఫీస్ ప్రారంభ కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈ ఈవెంట్ కు ప్రభాస్, ప్రశాంత్ నీల్, దుల్కర్ సల్మాన్, లెజెండరీ డైరెక్టర్ రాఘవేంద్ర రావు, అమితాబ్ బచ్చన్, నాని పాల్గొన్నారు. ఈ ఫంక్షన్ లో నాని తన అభిమాన హీరో అమితాబ్ ను కలిసి కొద్దిసేపు ముచ్చటించారు. అమితాబ్ తో ఫ్యాన్ బాయ్ మూమెంట్ ను ట్విట్టర్ లో షేర్ చేసిన నాని ఆ పోస్టుకు మోస్ట్ మెమొరబుల్ మూమెంట్ అని కామెంట్ చేసారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.