బాలీవుడ్ సూపర్ స్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ప్రాజెక్ట్ కే షూటింగ్ నిమిత్తం ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉంటున్నారు. నాగ్ అశ్విన్ డైరెక్షన్లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కే చిత్రంలో బిగ్ బి అమితాబ్ కీలక పాత్రను పోషిస్తున్నారు. వైజయంతీ మూవీస్ భారీ స్కేల్ మీద నిర్మిస్తున్న ఈ చిత్రంలో దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తుంది.
ఇటీవల జరిగిన వైజయంతీ మూవీస్ కొత్త ఆఫీస్ ప్రారంభ కార్యక్రమానికి అమితాబ్ ముఖ్య అతిధిగా విచ్చేసారు. ఈ కార్యక్రమంలో ప్రశాంత్ నీల్, దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు, నాగ్ అశ్విన్, నాని, దుల్కర్ సల్మాన్ తదితర నటీనటులు పాల్గొన్నారు. వీరందరూ కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తరుణంలో అమితాబ్ చేసిన లేటెస్ట్ పోస్ట్ సోషల్ మీడియాను ఒక్కసారిగా స్తంభింపజేసింది.
అమితాబ్ పోస్ట్ చేసిన ఫోటోలో, తన కారు విండో ను తట్టిందెవరా ? అని విండో ఓపెన్ చేసి చూడగా ఎదురుగా ఉన్న ఆమీర్ ను చూసి అమితాబ్ ఒక్కసారిగా షాకవుతారు. వ్యక్తిగత పనుల నిమిత్తం మరియు తన కొత్త సినిమా "లాల్ సింగ్ చద్దా" vfx పనుల నిమిత్తం ఆమిర్ కూడా హైదరాబాద్ లోనే ఉండడంతో ఈ అమూల్యమైన సంఘటన చోటుచేసుకుంది.