టాలీవుడ్ సీనియర్ నటుడు విజయ్ కుమార్ ఏకైక పుత్రుడు అరుణ్ విజయ్ హీరోగా నటిస్తున్న చిత్రం "ఏనుగు". సూర్యతో "సింగం" సినిమాలను తెరకెక్కించిన హరి ఈ సినిమాకు దర్శకత్వం వహించగా, ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా నటించారు. ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తమిళ, తెలుగు భాషలలో సి హెచ్ సతీష్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఈ మూవీ నుండి "అన్నా కొంచెం" అనే లిరికల్ సాంగ్ వీడియో కొంచెం సేపటి క్రితమే విడుదలైంది. యంగ్ హీరో బెల్లం కొండ శ్రీనివాస్ చేతులమీదుగా ఈ పాట రిలీజ్ అయ్యింది. శరత్ సంతోష్, నారాయణన్, శెంభాగరాజ్ ఆలపించగా, రాజశ్రీ సాహిత్యమందించారు.
షెడ్యూల్ ప్రకారం, జూన్ 17న థియేటర్లలో విడుదల కావలసిన ఈ సినిమా జూలై 1వ తేదికి వాయిదా పడింది. ఈ సినిమాలో రాధికా శరత్ కుమార్, సముద్రఖని, యోగిబాబు, కేజీఎఫ్ రామచంద్రరాజు తదితరులు కీలక పాత్రలను పోషించారు.