టాలీవుడ్ మాస్ యాక్షన్ హీరో గోపీచంద్ - మారుతీ కాంబోలో రాబోతున్న చిత్రం "పక్కా కమర్షియల్". ఇందులో రాశీఖన్నా కధానాయిక. హిట్టు మాట విని చాన్నాళ్ళైన గోపీచంద్ ఈ సినిమాతో ఎలాగైనా హిట్ ట్రాక్ లోకి రావాలని చూస్తున్నాడు. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ 2 సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. జెక్స్ బిజోయ్ సంగీతమందించారు.
తాజాగా ఈ సినిమా నుండి అందాల రాశి అనే పాటకు సంబంధించిన వీడియోను మేకర్స్ కొంచెంసేపటి క్రితమే విడుదల చేసారు. కే కే సాహిత్యమందించగా, సాయి చరణ్ భాస్కరుని, రమ్య బెహరా ఆలపించారు. భారీ సెట్టింగుల్లో, కలర్ఫుల్ గా ఉన్న ఈ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ప్రపంచవ్యాప్తంగా జూలై 1వ తేదీన విడుదల కాబోతుంది.