రెబల్ స్టార్ కృష్ణం రాజుగారి నటవారసుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు ప్రభాస్. 2002 లో ప్రారంభమైన ఈ మూవీ షూటింగ్ లో ఈ రోజు అంటే 2002 జూన్ 28వ తేదీన ప్రభాస్ పై చిత్రీకరింపబడిన తొలి షాట్ కు కృష్ణం రాజు గారు క్లాప్ కొట్టారు. అంటే నేటితో ప్రభాస్ తెలుగు చిత్రపరిశ్రమలో అడుగు పెట్టి సరిగ్గా ఇరవై ఏళ్ళు. రెండు దశాబ్దాల సుదీర్ఘ సినీ ప్రయాణంలో, ఈశ్వర్ తో మొదలుపెట్టి సలార్ వరకు, ఎవరి ఊహలకు అందని స్థాయిలో ప్రభాస్ స్టార్డం పెరిగింది. బాహుబలి చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ప్రభాస్ తదుపరి ఆదిపురుష్ గా, సలార్ గా, స్పిరిట్ గా మూడు భారీ బడ్జెట్ సినిమాలతో ఇండియన్ బాక్సాఫీస్ పై దండయాత్ర చెయ్యనున్నారు. ఐతే, ఈ సినిమాల విడుదలకు కొంచెం సమయం పడుతుంది. ప్రభాస్ ఇరవై ఏళ్ళ సినీ కెరీర్ ను పూర్తి చేసుకోవడంతో పలువురు సెలెబ్రిటీలు, అభిమానులు ఆయనకు శుభాకాంక్షలను తెలియచేస్తున్నారు.