సుకుమార్ - అల్లుఅర్జున్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతానికి ప్రేక్షకులంతా పుష్ప సీక్వెల్ కోసం కళ్లుకాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. పుష్ప 2 స్క్రిప్ట్ ఫైనలైజేషన్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా జరుగుతున్న వేళ, ఈ ప్రాజెక్ట్ పై ఒక ఇంటరెస్టింగ్ న్యూస్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అదేంటంటే, పుష్ప 2లో శ్రీవల్లికి సవతి పోరు మొదలు కానుందట. అదెలా అంటే, భన్వర్ సింగ్ షెకావత్ చెల్లెలి పాత్రలో ఒక క్రేజీ హీరోయిన్ సీక్వెల్ లో ఎంటర్ ఇస్తుందట. బన్నీ,ఫాహాద్ ఫాజిల్ ల యుద్ధంలో ఈ సిస్టర్ క్యారెక్టర్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని తెలుస్తోంది. ఐతే, ఈ న్యూస్ పై ఎలాంటి అధికారిక సమాచారం లేదు.