కెరీర్లో తొలిసారి అత్యధిక స్క్రీన్ లలో తన సినిమాను విడుదల చేస్తున్నాడు హీరో గోపీచంద్. మారుతి డైరెక్షన్లో గోపీచంద్, రాశిఖన్నా జంటగా నటించిన ఈ చిత్రం ఓవర్ సీస్ లో జూన్ 30వ తేదీ నుండి ప్రీమియర్ షోలు జరుపుకుంటుంది. గోపీచంద్ ఇప్పటివరకు నటించిన అన్ని సినిమాలలోకెల్లా పక్కా కమర్షియల్ సినిమా ఓవర్సీస్ లో అత్యధికంగా 217 థియేటర్లలో విడుదల కాబోతుంది. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా తెలిపింది.
పక్కా కమర్షియల్ సినిమాను గీతా ఆర్ట్స్ 2, యూవీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించగా, జెక్స్ బిజోయ్ సంగీతం అందించారు. ఇరు తెలుగు రాష్ట్రాల్లో జూలై 1వ తేదీన విడుదల కాబోతున్న ఈ చిత్రం పట్ల భారీ అంచనాలు ఉన్నాయి.