పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాలార్', 'ఆదిపురుష్', 'ప్రాజెక్ట్ కే' సినిమాలో నటిస్తున్నాడు. అయితే తాజాగా మారుతీ దర్శకత్వంలో ప్రభాస్ ఒక సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా ప్రభాస్ మార్క్ యాక్షన్ తో కూడిన తన మార్క్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా ఉంటుందని మారుతీ అన్నారు. ఈ సినిమాని యూవీ క్రియేషన్స్ బ్యానర్ నిర్మించబోతోంది. ఈ సినిమాని దసరాకి సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు.