గోపీచంద్ హీరోగా నటించిన సినిమా 'పక్కా కమర్షియల్'. ఈ సినిమాకి మారుతీ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రాశిఖన్నా హీరోయినిగా నటించింది. తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులను పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ సినిమా రన్ టైమ్ ని 2 గంటల 32 నిమిషాలుగా ఫిక్స్ చేసినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.ఈ సినిమాకి జాక్వెస్ బిజోయ్ సంగీతం అందించారు. ఈ సినిమా జూలై 1న రిలీజ్ కానుంది.