బాలీవుడ్ నటి కంగనా రనౌత్ వచ్చే నెల 4న ముంబై కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. 2020 నవంబర్ లో బాలీవుడ్ గీత రచయిత జావేద్ అక్తర్ కంగనా రనౌత్‌పై పరువు నష్టం దావా వేశారు. దానిపై విచారణ కొనసాగుతోంది. ఆమెను సోమవారం మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుకావాల్సి ఉంది. కానీ వ్యక్తిగత కారణాలతో మినహాయింపు ఇవ్వాలని ఆమె న్యాయవాది అభ్యర్థన మేరకు, వచ్చే నెల 4న విచారణ చేపట్టేందుకు న్యాయమూర్తి అంగీకరించారు.