హీరోయిన్ మీనా ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మంగళవారం రాత్రి మీనా భర్త విద్యాసాగర్ మృతి చెందాడు. పోస్ట్ కోవిడ్ సమస్యలతో బాధపడుతున్న విద్యాసాగర్ చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త విద్యాసాగర్‌తో మీనాకు 2009లో వివాహం జరిగింది. వీరికి నైనిక అనే కూతురు ఉంది.