బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ డైరెక్షన్లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన చిత్రం "ఆదిపురుష్". రూ. 500 కోట్ల భారీ బడ్జెట్ తో, అత్యాధునిక సాంకేతికతతో రూపొందిన ఈ చిత్రాన్ని టి సిరీస్ , రెట్రోఫిల్స్ సంస్థలు సంయుక్తంగా నిర్ణయించాయి. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల నిమిత్తం సంవత్సర కాలాన్ని తీసుకుంటుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానున్న ఈ సినిమా హాలీవుడ్ లో కూడా విడుదల కాబోతుంది. ఈ విషయంపై ఎప్పటి నుండో వార్తలు వస్తున్నప్పటికీ తాజాగా క్లారిటీ వచ్చింది.
ఇటీవల మీడియా తో ముచ్చటించిన కృష్ణంరాజు గారు ఆదిపురుష్ సినిమాతో ప్రభాస్ హాలీవుడ్ కి పరిచయం కాబోతున్నారని ప్రకటించడంతో ఈ సినిమాపై అధికారికంగా క్లారిటీ వచ్చినట్టైంది. దీంతో తమ అభిమాన హీరో ఇమేజ్ హాలీవుడ్ కి చేరుకోబోతుందని తెలిసి డార్లింగ్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa