ఒన్స్ అపాన్ ఎ టైం దేర్ వజ్ ఎ డెవిల్ ఈగల్ అని విక్రమ్ సినిమాలో కమల్ హాసన్ గురించి ఒక పాట ఉంటుంది. ఆ పాట లిరిక్స్ కు కమల్ సరిగ్గా సరిపోతాడు. ఈ మధ్య కాలంలో సినిమాలను తగ్గించేసిన కమల్ ఇటీవలే విక్రమ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి, సూపర్ డూపర్ హిట్ కొట్టాడు. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 400 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది.
ఇదిలావుండగా, తాజాగా లోకేష్ కనగరాజ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక వీడియో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోలో కమల్ పుషప్స్ చేస్తూ ఉంటాడు. ఒకటి రెండు కాదు ఏకంగా 26 పుషప్స్...అదికూడా ఆగకుండా. విక్రమ్ షూటింగ్ సమయంలో కమల్ కసరత్తులు చేస్తుండగా ఆయనకు తెలియకుండా లోకేష్ ఈ వీడియోను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు... అరవై ఏడేళ్ల ముసలాడిగా కాదు ఇరవై ఏడేళ్ల యువకుడిలా, చురుగ్గా, కమల్ పుషప్స్ చేసారు. ది ఈగల్ ఈజ్ లాండెడ్ అని కామెంట్లు పెడుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa