టాలీవుడ్ హీరోయిన్ రాశీ ఖన్నా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాజాగా తన కొత్త సినిమా ప్రమోషన్ ఇంటర్వ్యూలో తనకు రొమాంటిక్ సీన్స్ లో నటించడమంటే ఇష్టమని స్పష్టం చేసింది. నా దృష్టిలో కామెడీ చేయడం చాలా కష్టం. మన కామెడీ టైమింగ్ ఎదురుగా ఉన్న యాక్టర్ రియాక్షన్ పై ఆధారపడి ఉంటుంది. అదే రొమాన్స్ విషయానికొస్తే, చాలా తేలికైన పని అని హీరోలతో రొమాంటిక్ సీన్లలో నటించడం నా దృష్టిలో చాలా ఈజీ పని అని ఈ బ్యూటీ చెబుతోంది.