ప్రతి హీరో లేదా హీరోయిన్ కి డ్రీం రోల్ అనేది ఒకటుంటుంది. కెరీర్ లో ఒక్కసారైనా తాము కలగన్న పాత్రలో నటించాలని కోరుకోని నటులు ఉండరు. కొంతమందికి మహారాణి పాత్రలో, మరి కొంతమందికి సెంటిమెంట్ పాత్రల్లో, ఇంకొంతమందికి యాక్షన్...ఇలా అన్నమాట. తాజాగా పక్కా కమర్షియల్ ప్రమోషన్స్ లో పాల్గొన్న రాశిఖన్నా కూడా తన డ్రీం రోల్ పై నోరు విప్పింది. కామెడీతో పోలిస్తే, రొమాంటిక్ సినిమాలలో, సీన్లలో నటించటం చాలా ఈజీ అని చెప్పింది. అలానే, కామెడీ సీన్లలో నటించాలంటే నటీనటులు ఒకరికొకరు కో ఆపరేట్ చేసుకోవాలని, అలా చేస్తేనే సీన్ పండుతుందని, ఇది చాలా కష్టంతో కూడుకున్న పని అని చెప్పింది.
పక్కా కమర్షియల్ సినిమాలో హీరోయిన్ పాత్ర ఫన్నీ గా ఉంటుంది. అలాంటి పాత్రను చేసినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పింది. ఈ సినిమాలో కామెడీ చేసినందుకు గ్లామర్ తో పాటు కామెడీ కూడా చెయ్యగలననే మంచి గుర్తింపు వచ్చిందని, అవకాశం వస్తే యాక్షన్ సినిమాలలో లీడ్ రోల్ కూడా పోషిస్తానంటుంది రాశి. అంతేకాక, 2005లో విడుదలైన హాలీవుడ్ చిత్రం మిస్టర్ అండ్ మిస్సెస్ స్మిత్ వంటి సినిమాలలో నటించాలనుందని తన మనసులోని మాటను బయటపెట్టింది.
పోతే.., రాశిఖన్నా, గోపీచంద్ జంటగా, మారుతీ రూపొందించిన యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ జూలై 1న విడుదల కాబోతుంది.