డార్లింగ్ ప్రభాస్.... ప్రస్తుతం దేశం మొత్తానికి హాట్ ఫేవరెట్. బాహుబలి, సాహో, రాధేశ్యామ్ వంటి పాన్ ఇండియా సినిమాలతో దేశవ్యాప్తంగా లక్షల్లో అభిమానులను సంపాదించుకున్న ప్రభాస్ ఎంతో మృదుస్వభావి, బహు సిగ్గరి. అభిమానులు, సన్నిహితులు, తనతో పని చేసిన ప్రతి ఒక్కరు డార్లింగ్ అని ముద్దుగా పిలుచుకునే ప్రభాస్ తన అభిమానులను సరిగా పట్టించుకోవట్లేదని, వారు నిరాహార దీక్షకు దిగబోతున్నారట.
ఇంతకీ విషయమేమిటంటే, శ్రీకాకుళం జిల్లా ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రభాస్ సూర్య మాట్లాడుతూ... ప్రభాస్ కు మేము వీరాభిమానులం. ఆయన కోసం 365రోజులు, 24/7 ఎలాంటి స్వార్ధం లేకుండా పని చేస్తుంటాం. అలాంటి మాకు ఎలాంటి గుర్తింపు రావట్లేదు. ప్రభాస్ తో ఒక మెమొరబుల్ ఫోటో షూట్ సెషన్ అడిగితే, ఆయన మేనేజర్ల బృందం మమ్మల్ని చాలా చీప్ గా చూసింది. చాలామంది పేరు, డబ్బు, హోదా ఉన్నవాళ్లు ప్రభాస్ ను కలుస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఫోటోలు కూడా దిగుతున్నారు. మాలాంటి నిస్వార్ధ అభిమానులకు ఆయనను కలిసే అవకాశం రావట్లేదు. జూలై 15న హైదరాబాద్ వచ్చి, మా గోడును కృష్ణం రాజు గారు, శ్యామల గారితో వెళ్లబోసుకుంటాం. ప్రభాస్ నుండి రెస్పాన్స్ వచ్చేందుకు అవసరమైతే, నిరాహారదీక్ష కు కూడా పూనుకుంటాం.... అని చెప్పారు.