సినీ నటి పవిత్రా లోకేష్ కర్ణాటకలోని సైబర్ పోలీసులను ఆశ్రయించారు. కొంతమంది తన పేరుతో ఫేక్ అకౌంట్స్‌ను క్రియేట్ చేస్తున్నారని, అసభ్యకరమైన పోస్ట్‌లు పెడుతున్నారని ఫిర్యాదు చేశారు. తనపై పుకార్లు సృష్టించి తన పేరుని చెడగొడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పవిత్ర, సీనియర్ నటుడు నరేష్ పెళ్లి చేసుకోబోతున్నారంటూ ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.