బాలీవుడ్ స్టార్ హీరో అమీర్‌ఖాన్ తన లవ్ స్టోరీ గురించి తాజాగా ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నాడు. తాను 10 ఏళ్ల వయసులోనే ప్రేమలో పడ్డానని చెప్పాడు. తనతో పాటు టెన్నిస్ క్లబ్‌కి వచ్చే ఓ అమ్మాయిని ఇష్టపడ్డానని తెలిపారు. అయితే, ఆమె ఇండియా వదిలి విదేశాలకు వెళ్లిందని తెలియడంతో తన హార్ట్ బ్రేక్ అయిందని అమీర్ ఖాన్ చెప్పుకొచ్చాడు. అయితే, తాను ఇష్టపడ్డ విషయం ఆ అమ్మాయికి తెలియదని వన్ సైడ్ లవ్ అని అమీర్ అన్నాడు.