నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం NBK 107 సినిమాలో నటిస్తూ చాలా బిజీగా ఉన్నారు. క్రాక్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తున్న చిత్రమిదే. ఇందులో శృతి హాసన్ హీరోయిన్. ఇంకా టైటిల్ ఖరారు చెయ్యని ఈ మూవీ లో వరలక్షి శరత్ కుమార్, దునియా విజయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఇటీవల బాలయ్య కోవిడ్ కు గురికావడంతో ఈ మూవీ షూటింగ్ కు బ్రేక్ పడింది. తాజాగా బాలకృష్ణ కోవిడ్ నుండి కోలుకున్నారు. దీంతో ఈ మూవీ షూటింగ్ కూడా త్వరలోనే పునఃప్రారంభం కానుంది.
ఇదిలా ఉండగా, ఈ మూవీపై ఒక ఇంటరెస్టింగ్ అప్డేట్ విన్న బలయ్య అభిమానులు సూపర్ ఎక్సయిట్ అవుతున్నారు. అదేంటంటే, ఈ సినిమాలో అద్దిరిపోయే ఫైట్లు నాలుగైదు ఉన్నాయట. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే ఫైటింగ్ గూజ్ బంప్స్ తెప్పించేలా ఉంటుందట. ఇక, ఈ సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్ చేస్తున్నాడని ఎప్పటి నుండో వినిపిస్తుంది. కానీ, ఈ విషయంపై NBK 107 మూవీ టీం ఎలాంటి అధికారిక ప్రకటన చెయ్యలేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa