గత కొన్ని రోజులుగా సీనియర్ నటుడు నరేష్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.నటి పవిత్రా లోకేష్ ను నాలుగో పెళ్లి చేసుకుంటున్నాడని వార్తలపై నరేష్ క్లారిటీ ఇచ్చారు. తనకు, పవిత్రి లోకేష్ కు మధ్య ఉన్న అనుబంధం కేవలం స్నేహమేనని స్పష్టం చేశారు.పవిత్ర నాకు ఐదేళ్లుగా తెలుసు అని హ్యాపీ వెడ్డింగ్ సినిమా షూటింగ్ లో ఆమె పరిచయమైంది అని తెలిపారు. సమ్మోహనం సినిమా సమయంలోనే ఇద్దరి మధ్య స్నేహం బలపడిందని తెలిపారు. తమ మధ్య ఉంది స్నేహమేనని తెలిపారు.