ముంబైలోని తాజ్ హోటల్‌పై జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో 'మేజర్' సినిమా తెరకెక్కింది. ఈ ఆపరేషన్ లో కీలక పాత్ర పోషించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రలో అడివి శేష్ నటించారు. ఈ సినిమాలో సాయి మంజ్రేకర్ హీరోయినిగా నటించింది. ఈ సినిమాకి శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు.ఈ సినిమా జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి విజయం సాధించింది.తాజాగా ఈ సినిమా ఓటిటిలో ప్రసారం కానుంది. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ 'నెట్‌ఫ్లిక్స్'లో జూలై 3 నుండి స్ట్రీమింగ్ కానుంది.