గోపీచంద్ హీరోగా నటించిన సినిమా 'పక్కా కమర్షియల్'. ఈ సినిమాకి మారుతీ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రాశిఖన్నా హీరోయినిగా నటించింది. ఈ సినిమాకి జాక్వెస్ బిజోయ్ సంగీతం అందించారు.ఇప్పటివరకు రిలీజైన పోస్టర్లు, గ్లిమ్స్, లిరికల్ సాంగ్స్, టీజర్, రీసెంట్ గా ట్రైలర్... అన్నీ కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలను క్రియేట్ చేసాయి. ఈ సినిమాని యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమా జూలై 1న రిలీజ్ కానుంది.