'కేజీఎఫ్' సినిమాలో నటించిన బీఎస్ అవినాష్ కు ఓ ప్రమాదంలో ప్రాణాపాయం తప్పింది. బెంగళూరులో తాను కారు ప్రమాదానికి గురైనట్లు బుధవారం సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అవినాష్ ప్రయాణిస్తున్న కారును ట్రక్కు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో అతనికి ఎలాంటి గాయాలు కాలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.