ఐటమ్ సీసా వదిలారు మాస్ మహారాజా రవితేజ. ప్రశాంత్ మాండవ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న సినిమా 'రామారావు ఆన్ డ్యూటీ'. ఈ యాక్షన్ థ్రిల్లర్ లో దివ్యాంశ కౌశిక్, రజీషా విజయన్ హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమాలో అదిరిపోయే ఐటమ్ సాంగ్ ఒకటి ఉండనుంది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ అన్వేషి జైన్ చిందేసింది. గురువారం ఐటమ్ ప్రోమో రిలీజ్ చేశారు. 'నా పేరు సీసా' అంటూ సాగే ఈ సాంగ్ లో అన్వేషి జైన్ ఓ రేంజ్ లో అందాలు ఆరబోసింది. బహుశా.. ఇది వరకు ఏ ఐటమ్ సాంగ్ లో ఇంత బరువైన అందాలను చూసి ఉండకపోవచ్చు. పూర్తి ఐటమ్ సాంగ్ ను ఈరోజు వదలనున్నారు. దాంతో పాటు రిలీజ్ డేట్ ను ప్రకటించే అవకాశం ఉంది.