థోర్ : లవ్ అండ్ థండర్అనేది మార్వెల్ కామిక్స్ . ఇది థోర్ : రాగ్నరోక్ కి ప్రత్యక్ష సీక్వెల్. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లో రాబోతున్న 29వ చిత్రం. ఈ చిత్రానికి తైకా వెయిటీ దర్శకత్వం వహించారు. మార్వెల్ స్టూడియోస్ నిర్మించిన ఈ సినిమాని వాల్ట్ డిస్నీ స్టూడియోస్ మోషన్ పిక్చర్స్ పంపిణీ చేస్తోంది. జులై 7 న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తున్నారు మేకర్స్. సరికొత్త పోస్టర్లు, వీడియోలు రిలీజ్ చేస్తున్నారు.