పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తో కలిసి తమిళ సూపర్ హిట్ "వినోదయ సిత్తం" రీమేక్ లో నటించబోతున్నారని ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఆల్రెడీ సెట్స్ మీదున్న హరిహరవీరమల్లు సినిమాపై ప్రేక్షకులు ఎంత క్యూరియస్ గా ఉన్నారో ప్రచారంలో ఉన్న వినోదయ సిత్తం రీమేక్ పై అంతకన్నా ఆసక్తిని కలిగి ఉండటం విశేషం. చెప్పాలంటే, హరీష్ శంకర్ డైరెక్టోరియల్ లో తెరకెక్కాల్సిన "భవదీయుడు భగత్ సింగ్" కన్నా ఈ మధ్యకాలంలో ఈ సినిమాపై వస్తున్న వార్తలు ఎక్కువ.
పోతే..., ఈ మూవీ ఇటీవలే సీక్రెట్ గా లాంఛ్ అయిపోయిందని నిన్నటి వరకు ప్రచారం జరిగింది. తాజాగా ఈ మూవీ జూలై 12నుండి రెగ్యులర్ షూటింగ్ కోసం సిద్ధం అవుతుందని టాక్. ఈ సినిమా కోసం పవన్ కేవలం 20రోజుల కాల్షీట్లను మాత్రమే ఇచ్చాడంట.
ఓటిటిల రాకతో ఏ భాషలో ఎలాంటి సినిమా వచ్చినా ప్రతి ఒక్క ప్రేక్షకుడు చూడగలుగుతున్నాడు. డిజిటల్ లో ఈ సినిమాను చాలా వరకు అందరు చూసేసారు. మరి ఇలాంటి సినిమాను పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో రీమేక్ చెయ్యడం ఎంతవరకు కరెక్ట్? అని కొంతమంది తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.