ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భార‌త్ చిత్రంలోని స్టిల్ అదిరింది

cinema |  Suryaa Desk  | Published : Mon, Aug 27, 2018, 03:08 PM

బాలీవుడ్ సుల్తాన్  సల్మాన్ ఖాన్ కొత్త చిత్రం ‘భారత్‌’లోనూ కత్రినాకైఫ్‌కే చోటు దక్కింది. ఈ చిత్రంలో ఈ జోడీ ఎలా ఉంటుందో అనే   అభిమానుల ఎదురుచూపులు   ఫలించాయి. తాజాగా ఈ చిత్రంలోని ఓ స్టిల్‌ను సల్మాన్‌ పంచుకొన్నాడు. నల్ల రంగు షేర్వాణీలో సల్మాన్‌, ఆకుపచ్చ లెహంగాలో కత్రినా స్టెప్పులేస్తున్న ఆ ఫొటో నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ఈ ఫొటో చూశాకా మళ్లీ మెరుపులు మొదలయ్యాయి అంటూ సంబరపడిపోతున్నారు అభిమానులు. మాల్టాలో జరుగుతున్న ఈ సినిమా రెండో షెడ్యూల్‌ పూర్తయింది. టబు, దిశాపటానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జూన్‌లో విడుదల   చేయనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa