రాజ్ మెహతా దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ మరియు బ్యూటీ క్వీన్ కియారా అద్వానీ ప్రధాన పాత్రలలో నటించిన 'జగ్‌జగ్ జీయో' మూవీ విడుదలైన అప్పటి నుంచి మంచి వాసుల్ని రాబడుతుంది. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో అనిల్ కపూర్ మరియు నీతూ కపూర్ కీలక పాత్రలలో నటించారు. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా టోటల్ గా బాక్స్ఆఫీస్ వద్ద 53.66 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. ఈ చిత్రంలో మనీష్ పాల్, ప్రజక్తా కోలి తదితరులు సహాయక పాత్రల్లో నటిస్తున్నారు. హీరో యష్ జోహార్, కరణ్ జోహార్ మరియు అపూర్వ మెహతా ఈ సినిమాని వయాకామ్ 18 స్టూడియోస్ మరియు ధర్మ ప్రొడక్షన్స్ పై నిర్మించారు.