పాన్ ఇండియా సినిమా 'లైగర్' సినిమా నుంచి తన న్యూడ్ పోస్టర్ వదిలిన విజయ్ దేవరకొండ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారారు. ఈ వైరల్ పోస్టర్‌పై తాజాగా నటి సమంత స్పందించారు. 'విజయ్‌కి రూల్స్ ఏంటో బాగా తెలుసు. అవసరమైతే వాటిని బ్రేక్ చేయగల ధైర్యం కూడా ఉంది. లైగర్ పోస్టర్ అదిరిపోయింది' అని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పేర్కొంది. దీనికి విజయ్ కూడా బదులిచ్చాడు. సమంత నువ్వు బెస్ట్ అంటూ రిప్లై ఇచ్చాడు.