మైసూర్‌లో ఆదివారం హైడ్రామా నెలకొంది. ఓ హోటల్ నుంచి సినీ నటులు నరేష్, పవిత్ర కలిసి బయటకు రావడం సంచలనం రేపింది. ప్రస్తుతం ఓ కన్నడ సినిమాలో నరేష్ నటిస్తున్నారు. అక్కడకు వెళ్లిన నరేష్ భార్య రమ్య ఆగ్రహం వ్యక్తం చేసింది. సినీ నటి పవిత్రను చెప్పుతో కొట్టబోయింది. పోలీసులు రమ్యను అడ్డుకున్నారు. ఇక రమ్యను చూస్తూ నరేష్ విజిల్ వేసుకుంటూ వెళ్లిపోయాడు. ఈ వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.