అడవి శేష్ హీరోగా తెరకెక్కిన 'మేజర్' సినిమా ఆదివారం (జూన్ 3) నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అవుతోంది. ముంబై 26/11 దాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా సినిమా రూపొందింది. భావోద్వేగాల సమాహారమైన ఈ సినిమాకు దేశవ్యాప్తంగా ఆదరణ లభించింది. ఈ సినిమాకు శశికిరణ్ దర్శకత్వం వహించగా, ప్రకాష్ రాజ్, శోభిత ధూళిపాళ్ల కీలక పాత్రల్లో నటించారు.