ఇప్పుడంతా వెబ్ సిరీస్‌లా హవా నడుస్తున్న తరుణంలో జనాల్లో మంచి గుర్తింపు నటులతో ఫిల్మ్ మేకర్స్ క్రేజీ ప్రాజెక్టులు చేస్తున్నారు. లేటెస్ట్‌గా అనసూయతో ఫీమేల్-సెంట్రిక్ వెబ్ సిరీస్ చేసేందుకు శ్రీకారం చుట్టారు. డైరెక్టర్ క్రిష్ స్క్రిప్ట్ అందిస్తున్న ‘కన్యాశుల్కం’ వెబ్ సిరీస్ లో మధురవాణి అను వేశ్య పాత్రలో అనసూయ కనిపించనుంది. గురజాడ అప్పారావు నాటకం ‘కన్యాశుల్కం’ ఆధారంగా ఈ వెబ్ సిరీస్‌ను తెరకెక్కుతుంది.