రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తున్న సినిమా 'రుద్రుడు'. ఈ సినిమాకి కతిరేశన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్ హీరోయినిగా నటిస్తుంది.ఈ సినిమాకి జీవీస్ ప్రకాష్ సంగీతం అందించారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ తేదిని ప్రకటించారు చిత్ర బృందం. ఈ సినిమాకి సంబంధించి లారెన్స్ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ 23న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.