ప్రముఖ అస్సామీ నటుడు కిషోర్ దాస్ ఆదివారం కన్నుమూశారు.ఏడాది కాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న కిశోర్ చెన్నైలోని ఓ ఆస్పత్రిలో కన్నుమూశారు. అస్సామీ సినీ పరిశ్రమలోని ప్రముఖ వ్యక్తులలో దాస్ ఒకరు. అతను 'బంధున్', 'బిధాత' మరియు 'నేదేఖా ఫగున్' వంటి అనేక అస్సామీ టెలివిజన్ షోలలో కనిపించాడు.'తురుట్ తురుట్' అనే పాటతో కిశోర్ దాస్ స్టార్ గా మారిపోయాడు. అతని మృతితో సినీ పరిశ్రమలో విషాదం అలుముకుంది.