మలయాళం లో స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ తొలిసారి మెగాఫోన్ పట్టి డైరెక్ట్ చేసిన చిత్రం "లూసిఫర్". 2019లో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇందులో మోహన్ లాల్ కీలకపాత్రను పోషించారు. ఈ సినిమాను "గాడ్ ఫాదర్" పేరిట మెగాస్టార్ చిరంజీవి తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రానికి కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా డైరెక్టర్.
గాడ్ ఫాదర్ లో నయనతార, సల్మాన్ ఖాన్, సత్యదేవ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటివరకు సైలెంట్ గా షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ నుండి తాజాగా ఒక బిగ్ అప్డేట్ ను ఎనౌన్స్ చేసారు మేకర్స్. ఈరోజు సాయంత్రం 5:45గంటలకు గాడ్ ఫాదర్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చెయ్యబోతున్నట్టు అధికారిక పోస్టర్ ను రిలీజ్ చేసారు. మలయాళ లూసిఫర్ ను చాలామంది డబ్బింగ్ వెర్షన్ లో ఆల్రెడీ చూసేసారు. కానీ, ఈ సినిమా పట్ల మెగా అభిమానులు ఉత్సుకత ఏమాత్రం తగ్గట్లేదు. గాడ్ ఫాదర్ గా చిరు ఫిస్ట్ లుక్ ఎలా ఉండబోతుందా ? అని చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
పోతే.., ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలిమ్స్ సంస్థలు సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. తమన్ సంగీతం అందిస్తున్నారు.