యోగా మరియు స్పిరిట్యుయాలిటీ కి సంబంధించి భారతదేశంలో "సద్గురు" గా పేరు తెచ్చుకున్న ఇషా ఫౌండేషన్ అధినేత జగ్గీ వాసుదేవ్ గారికి సామాన్యులతో పాటు సెలెబ్రిటీలలో కూడా చాలామంది భక్తులున్నారు. వారిలో మన టాలీవుడ్ కి సంబంధించి సమంత, ఉపాసన కామినేని వంటి బిగ్ స్టార్ సెలెబ్రిటీలు కూడా ఉండడం విశేషం.
ఇటీవల జరిగిన 17వ ATA కన్వెన్షన్ లో సద్గురు, ఉపాసన ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాసన అడిగిన కొన్ని ఆసక్తికర ప్రశ్నలకు సద్గురు ఇచ్చిన సమాధానాలు హాట్ టాపిక్ గా నిలిచాయి.
తన లైఫ్ లోని RRR గురించి అంటే రిలేషన్ షిప్, రిప్రొడక్షన్, రోల్ ఇన్ లైఫ్ గురించి ఉపాసన సద్గురును అడిగింది. ఉపాసన మాట్లాడుతూ... దాదాపు పది సంవత్సరాల కంటే ముందు నుండి తాను ఒక హెల్తి రిలేషన్ లో ఉన్నట్టు పేర్కొంది. ఇందుకు సద్గురు ఆశ్చర్యపోయారు.
అలానే రిప్రొడక్షన్ అంటే పిల్లల గురించి సద్గురును అడిగింది ఉపాసన. అప్పుడు ఆయన మాట్లాడుతూ, నువ్వు కనక పిల్లల్ని కనకుండా ఉండాలని నిర్ణయించుకుంటే, ఒక వరల్డ్ క్లాస్ గిఫ్ట్ ను బహుకరిస్తానని చెప్పారు. మానవులందరికీ తమ కార్బన్ ఫుట్ ప్రింట్స్ ను చూసుకోవాలనుంటుందని, ఒకవేళ హ్యూమన్ ఫుట్ ప్రింట్ ను కనుక మనం రెడ్యూస్ చేస్తే, గ్లోబల్ వార్మింగ్ గురించి కూడా దిగులు చెందాల్సిన అవసరం ఉండదని, సో.., ఎవరైతే పిల్లల్ని కనకూడదని నిశ్చయించుకుంటారో, అలాంటివారు సమాజంలో ఉండడం చాలా మంచి పరిణామం... అని చెప్పుకొచ్చారు. ఇది విన్న ఉపాసన వెంటనే, ఐతే మీరు మా అమ్మ, అత్తగారితో ఒకసారి ఫోన్ లో మాట్లాడాలని కోరింది. అలాంటి ఎందరో అత్తగార్లతో తాను మాట్లాడానని సద్గురు చెప్పారు. అంటే... నిజంగానే పిల్లల్ని కనకూడదని ఉపాసన నిర్ణయించుకుందా ....? అని మెగా ఫ్యాన్స్ సతమవుతున్నారు.