కోలీవుడ్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా హైస్టారికల్ మూవీ, గ్రేట్ డైరెక్టర్ మణిరత్నం డ్రీం ప్రాజెక్ట్ "పొన్నియిన్ సెల్వన్". షూటింగ్ పూర్తి చేసుకుని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ మూవీ నుండి మొన్న విక్రమ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చెయ్యగా, తాజాగా హీరో కార్తీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసారు. గుర్రంపై స్వారీ చేస్తూ, విజయోత్సాహంతో పొంగి పోతున్న కార్తీ ఈ పోస్టర్ లో మనకు కనిపిస్తాడు. రాజ్యం లేని రాజు, గూఢచారి, ధీరుడు, శూరుడు "వాంతియతేవన్" పాత్రలో కార్తీ ఈ సినిమాలో నటిస్తున్నాడు.
2010లో మణిరత్నం డైరెక్షన్లో విక్రమ్, ఐశ్వర్యారాయ్ జంటగా నటించిన పిదప ఈ సినిమాలో మరోసారి వీరిద్దరూ కలిసి జతకట్టారు. వీరితో పాటు ఈ సినిమాలో కార్తీ, జయం రవి, త్రిష ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ రెండు భాగాలుగా రూపొందుతుంది. మొదటి భాగం సెప్టెంబర్ 30న విడుదలకు రెడీ అవుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa